తల్లి కాబోతున్న కత్రిన.. ఫ్రెండ్స్‌తో బీచ్‌‌లో పార్టీ

దిశ, సినిమా : బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌‌కు సంబంధించిన గుడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ప్రియుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తల్లికాబోతున్నట్లు తెలుస్తోంది..Latest Telugu News

Update: 2022-07-17 07:52 GMT

దిశ, సినిమా : బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌‌కు సంబంధించిన గుడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ప్రియుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తల్లికాబోతున్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే.. తాజాగా మాల్దీవ్స్‌కు వెళ్లేక్రమంలో ఈ జంట ఎయిర్‌పోర్ట్‌‌లో మీడియా కంటపడింది. ఈ సందర్భంగా వదులైన రెడ్ కలర్ టీషర్ట్ ధరించిన కత్రిన.. భర్త వెంట నడుస్తూ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆమె గర్భవతి కావడం వల్లే బేబీ బంప్ కనిపించకుండా అలా కవర్ చేసుకుందంటూ పుకార్లు మొదలయ్యాయి.

ఇక ఇదే విషయమై ప్రముఖ జోత్యిష్యుడు సంజయ్ బీ జుమాని ఓ ఇంటర్య్వూలో స్పందించాడు. 'కత్రినాకు 40 ఏళ్లు. ఆమె ఇప్పుడే పిల్లలను కనాలి. రాబోయే రెండేళ్లపాటు కెరీర్‌ను పక్కనపెట్టి పిల్లలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది' అంటూ వివరించాడు. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరడంతో అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జులై 16న బర్త్‌డే పార్టీ చేసుకున్న కత్రిన బీచ్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్‌తో మైమరిపిస్తోంది.


Similar News