Karthika Deepam: కార్తీక్ ను సొంతం చేసుకునేందుకు కొత్త స్కెచ్ వేసిన జ్యో

‘థాంక్యూ బావా..’ అని జ్యో సంతోషపడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది.

Update: 2024-11-26 09:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం( Karthika Deepam ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘నాకు నువ్వు ఇప్పటి వరకు కంగ్రాట్స్ చెప్పలేదు బావా’ అని మరదలు అంటుంది. అప్పుడు కార్తిక్  వెంటనే సారీ.. కంగ్రాట్యులేషన్స్.. అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ‘థాంక్యూ బావా..’ అని జ్యో సంతోషపడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ‘ఈ చేతులు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి’ అని అనుకుంటూ ఉంటుంది . వెంటనే కార్తీక్ చేతిని వెనక్కి తీసుకుని.. జ్యోకి ఆఫీసు మేటర్లు చెబుతాడు. ‘మన ఇంట్లో చిన్న సమస్య వచ్చినా బాధపడతాం.. కానీ సంస్థలో చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలా అవుతుంది దాని వలన అందరూ ఇబ్బందిపడతారు.. ఈ కంపెనీని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. సీఈవోగా నువ్వు బాధ్యతలు తీసుకున్నావంటే వారి బాధ్యత కూడా నీదే .. ఈ మాటను ఎప్పటికీ మరిచిపోకు..’ అని కార్తీక అంటాడు. అలాగే బావా.. నేను నీతో కూడా శభాష్ అనిపించుకుంటాను..’ అంటుంది జ్యో.

వెంటనే కార్తీక్ ‘సరే ఆల్ ది బెస్ట్..’ అంటాడు. ‘థాంక్యూ బావా..’ మరదలు కూడా అంటుంది. సరే వెళ్తాను ‘బై..’ అని చెప్పేసి వెళ్తాడు. ఇక కార్తీక్, కారు తీసుకుని వెళుతూ ఉంటాడు. " బై కాదు బావా.. ఇప్పటి నుంచి ప్రతీ రోజూ నువ్వు హాయ్ చెప్పాలి.. అలాగే నాతోనే తిరగాలి. ఉండాలి కూడా.. నిన్ను ఆ దీపను కలవనివ్వను.. ఇప్పుడు నా చేతికి చిక్కావ్ .. ఈసారి వదిలిపెట్టను.. దీపా మా బావ నీ మెడలో కట్టిన తాళి తియ్యడానికి రెడీగా ఉండు" మరదలు అని అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Tags:    

Similar News