ముఖ్యమంత్రి మనవళ్లతో హీరోయిన్స్ డేటింగ్.. పిక్స్ వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తమ డేటింగ్ గురించి ఓపెన్ అయ్యారు..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తమ డేటింగ్ గురించి ఓపెన్ అయ్యారు. పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' తాజా ఎపిసోడ్లో పాల్గొన్న భామలు.. కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ మేరకు జాన్వీ, సారా అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలు నిజమేనా? అన్ని కరణ్ అడిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన బ్యూటీస్ ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తామా? అంటూ సిగ్గుపడుతూనే.. ఆ అన్నదమ్ములు పొరుగింట్లో ఉండేవాళ్లని, లాక్డౌన్ సమయంలో వాళ్లతో స్నేహం ఏర్పడినట్లు అంగీకరించారు.
కాగా వీర్ పహారియా, శిఖర్ పహారియా అనే సోదరులు ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ న్యూస్ సంచలనంగా మారింది. అంతేకాదు వాళ్లతో ఈ భామలు దిగిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.