కొత్త పాత్రలో కంగన.. మేకప్ మ్యాన్‌గా ఆస్కార్ విన్నర్
దిశ,సినిమా: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మంచి కథలు, పవర్ఫుల్ పాత్రలు ఎంచుకుంటూ అద్భుత నటనతో అలరిస్తున్న నటి కంగనా రనౌత్..Latest Telugu News
దిశ,సినిమా: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మంచి కథలు, పవర్ఫుల్ పాత్రలు ఎంచుకుంటూ అద్భుత నటనతో అలరిస్తున్న నటి కంగనా రనౌత్. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. కంగన ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' పేరుతో ఓ సినిమాను చేయబోతోంది. 1975 -1977 ఎమర్జెన్సీ టైమ్‌లో ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక టైటిల్ రోల్ కంగనానే పోషిస్తుండగా.. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా తనే నిర్వర్తించనుంది. ఈ క్రమంలోనే ఇందిరా గాంధీ పాత్రకు సంబంధించిన లుక్, గెటప్ విషయంలో ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది కంగన.
ఇక ప్రోస్థెటిక్ మేకప్‌తో ఆమె లుక్ తీర్చిదిద్దే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉండగా.. ఈ పాత్ర మేకప్ కోసం ఆస్కార్ విన్నర్ డేవిడ్ మిలనోవ్ స్కీ పనిచేయబోతున్నారు. 'డార్కెస్ట్ అవర్' చిత్రానికి గాను 2017లో ఆస్కార్ అవార్డ్ అందుకున్న మిలనోవ్ స్కీ.. 'బ్యాట్‌మాన్', 'వరల్డ్ వార్ జడ్' తదితర చిత్రాలకు మేకప్ మ్యాన్‌గా పనిచేశాడు. కాగా కంగన.. అతడు తనకు మేకప్ వేస్తున్న ఫొటోలను ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.