కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ యధాతథస్థితి కొనసాగించండి : సుప్రీంకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో యధాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Update: 2022-07-27 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో యధాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది. జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ఓకా, జేబీ పర్దివాలా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆగస్టు 23 లోపు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని, దానికి పిటిషనర్లు రిజాయిండర్‌ కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై బాధితులు 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఆరు పిటిషన్లు కలిపి ఒకే సారి విచారణకు ఈ నెల 22న సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


Similar News