వారానికి ఎన్ని సార్లు తాగుతున్నారు.. ఇలా చేస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుందట జాగ్రత్త !
దిశ, ఫీచర్స్ : ఆధునిక సమాజంలో మద్యపాన సేవనం సాధారణంగా మారిపోగా.. దీని వల్ల కలిగే అనర్థాల గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఆధునిక సమాజంలో మద్యపాన సేవనం సాధారణంగా మారిపోగా.. దీని వల్ల కలిగే అనర్థాల గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నిజానికి ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ హార్మోన్ల వల్ల మెదడు ఉత్తేజితమవడం, శరీరంలో ఉత్సాహం పెరగడం సహజం. కాగా అది మెదడుపై ఎలా చూపించే నెగెటివ్ ఎఫెక్ట్ గురించి ఇప్పటికే అనేక అధ్యయనాలు హెచ్చరించాయి. ఇప్పటికే మద్యాన్ని స్లో పాయిజన్‌గా పరిగణించగా.. వారానికి నాలుగు పెగ్గులేస్తే జ్ఞాపకశక్తి మందగిస్తుందని తాజా పరిశోధన వెల్లడించింది. మద్యపానం సేవనం మెదడులో మార్పులతో ముడిపడి ఉంటుందని కనుగొంది. ఈ అధ్యయన వివరాలు పీఎల్‌ఓఎస్ మెడిసిన్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురితమైంది.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పడం ఫ్లాష్‌న్యూస్ కాకపోవచ్చు, కానీ అది ఎంత హానికరమో తెలుసుకునేందుకు కొన్నేళ్లుగా అధ్యయనాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడం నుంచి మెదడుకు నిర్మాణాత్మక నష్టం కలిగించడం వరకు మద్యపానం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ వినియోగాన్ని డిమెన్షియాతో ముడిపెట్టిన ముందస్తు అధ్యయనాలను అనుసరించి, ఆల్కహాల్ వల్ల జ్ఞాపకశక్తి ఎలా తగ్గిపోతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు 20,000 మందికి పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి, అధికంగా ఆల్కహాల్ తాగేవారి మెదడులో ఐరన్ (ఇనుము) అసాధారణంగా చేరడాన్ని గుర్తించారు. దీంతో మితమైన మద్యపానం చేసేవారిలో కూడా ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారు.
మెదడులోని ఐరన్ లెవల్స్ మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ (MRI) ఉపయోగించి కనుగొనగా.. వారానికి ఏడు యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ వినియోగించిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గేందుకు కారణమవుతుందని గుర్తించారు. ఒక యూనిట్ ఆల్కహాల్ అంటే 10 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన ఆల్కహాల్‌గా నిర్వచిస్తారు. అంటే ఒక పెద్ద గ్లాసు వైన్ అంటే రెండు నుంచి మూడు యూనిట్ల ఆల్కహాల్‌గా పరిగణించొచ్చు. అదే సాధారణ బీర్‌లో 1.5 నుంచి రెండు యూనిట్ల మద్యపానం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అధ్యయనం ప్రకారం వారంలో ఏడు యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నవారి మెదడులో ఐరన్ చేరుతుండగా, ఇది అభిజ్ఞా పనితీరుతో ముడిపడి ఉంది. అంతేకాదు మద్యపానం థయామిన్ స్థాయిలను తగ్గిస్తుంది కూడా. ఆల్కహాల్-ప్రేరిత థయామిన్ లోపం వల్ల బ్లడ్-బ్రెయిన్ అవరోధానికి కారణమవుతుంది. అందువల్ల మద్యపానం చేసే వ్యక్తులు శరీరంలో థయామిన్ స్థాయిలను భర్తీ చేయగలిగితే.. ఐరన్ లెవల్స్ వల్ల మెదడుపై కలిగే ప్రభావాన్ని నిరోధించవచ్చు.
- అన్యా టోపివాలా, సైంటిస్ట్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం