NTR: సోలో హీరోగా ఎన్టీఆర్ టార్గెట్ ఫినిష్.. రూ. 500 కోట్లతో భారీ రికార్డ్

కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Update: 2024-10-13 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన ఫస్ట్‌ డేనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేవలం వన్ వీక్‌లోనే రూ. 405 కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా దేవర 16 రోజు వసూళ్లు చూసినట్లైతే.. వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల రూపాయల కలెక్షన్లు బ్రేక్ చేసింది. దీంతో తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికన హంగామా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక దేవరలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అద్భుతంగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. సోలో హీరోగా తారక్ ఇన్ని కోట్లు రికార్డు బ్రేక్ చేశారంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో పాటలు కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయడంలో అతిశయోక్తిలేదు. ఇక దేవర రెండో భాగం చిత్రీకరణ కూడా స్టార్ట్ చేయనున్నారట. అందులో జాన్వీ కపూర్ రోల్ అద్భుతంగా ఉండనుందని దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచుతున్నారు.


Similar News