కాంగ్రెస్ నిరసనలు దేశ రక్షణ కోసం కాదు: JP Nadda
JP Nadda Alleged that Congress Protests are not Satyagraha| బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ చేస్తున్న నిరనసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు చేస్తున్న నిరసనలు దేశాన్ని రక్షించేందుకు కాదని నడ్డా అన్నారు. సోనియా గాంధీని ఈడీ రెండోసారి
దిశ, వెబ్‌డెస్క్: JP Nadda Alleged that Congress Protests are not Satyagraha| బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ చేస్తున్న నిరనసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు చేస్తున్న నిరసనలు దేశాన్ని రక్షించేందుకు కాదని నడ్డా అన్నారు. సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారణకు పిలవగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపాయి. వీటిపై జేపీ నడ్డా బుధవారం స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఒక కుటుంబాన్ని రక్షించేందుకు నిరసనలు చేస్తున్నారని, దేశాన్ని కాదని అన్నారు. 'కాంగ్రెస్ నిరసనలు ఏమీ సత్యాగ్రహం కాదు. కానీ అవి నిజాన్ని కప్పిపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు. గాంధీలు విచారణ ఏజెన్సీలకు సమాధానాలు చెప్పాలి. వారికి వారు చట్టానికి అతీతులుగా అని భావిస్తున్నారు' అని నడ్డా అన్నారు. అంతేకాకుండా ఒక కుటుంబాన్ని చట్టానికి అతీతంగా ఉంచాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించవని, వాటిని దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలని నడ్డా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: మంత్రి నా ఇంటిని అలా వాడుకున్నాడు.. 10 రోజులకు ఓసారి వచ్చి..