జర్నలిస్టును అండర్‌వేర్‌తో నిలబెట్టిన పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారాన్ని సేకరిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులపై ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ థియేటర్‌కు చెందిన నీరజ్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాతో పాటు ఆయన కుమారుడు గురుదత్ శుక్లాపై అసత్య ఆరోపణలు చేశారనే ఆరోపణలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో థియేటర్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు నిరసనలు వ్యక్తం చేయడంతో దీనిని ఓ జర్నలిస్టు వీడియో తీసి ప్రసారం చేసేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని, నిరసనకారులను ఆ జర్నలిస్టును అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి బట్టలు తీసివేయించి అండర్‌వేర్ మీద నిల్చోబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. బట్టలు ఉంటే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని అందుకే లోదుస్తుల్లో ఉంచామని చెప్పుకొచ్చారు.