గుండెపోటుతో హాస్పిటల్లో జానీ మాస్టర్ తల్లి.. ఈ పాపం ఊరికే పోదంటూ జానీ భార్య సంచలన పోస్ట్..
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడంటూ సదరు యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జానీను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ భార్య అవన్ని అబద్ధాలు అని మహిళా కొరియోగ్రాఫర్ పై సంచలన కామెంట్స్ చేసింది. అయితే నిన్న జానీ మాస్టర్ తల్లి గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. తాజాగా ఈ సంఘటన పై జానీ భార్య సుమలత అలియాస్ అయేషా స్పందిస్తూ జానీ మాస్టర్ అకౌంట్ నుంచి ఓ సంచలన పోస్ట్ పెట్టింది.
హాస్పిటల్ బెడ్ పై ఉన్న జానీ మాస్టర్ తల్లి వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు... అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి” అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
(CONTENT CREDITS TO ALWAYSJANI INSTAGRAM ID)