20 ఏళ్ల క్రితమే బ్రేకప్.. మళ్లీ అతనితోనే స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్
దిశ, సినిమా : అమెరికన్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ యాక్టర్ బెన్ అఫ్లెక్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
దిశ, సినిమా : అమెరికన్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ యాక్టర్ బెన్ అఫ్లెక్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థపు ఉంగరం ధరించిన జెన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే జెన్నిఫర్, అఫ్లెక్ ఇద్దరూ గతంలో కొంతకాలం రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 2002లోనే వీరికి నిశ్చితార్థం జరిగినప్పటికీ.. ఆ తర్వాత తలెత్తిన గొడవల వల్ల బ్రేకప్ చెప్పుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ఈ ఇరవయేళ్ల కాలంలో పలువురితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన జెన్నీ.. ఏ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అటు అఫ్లెక్ కూడా జెన్నిఫర్ గార్నర్‌తో విడిపోయాడు. ఈ నేపథ్యంలోనే లోపెజ్, అఫ్లెక్ మధ్య మళ్లీ ప్రేమ చిగురించడంతో గతేడాదే తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా.. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను జెన్నీ అభిమాని ఒకరు ట్విట్టర్లో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా అవుతోంది.