జీప్ ఇండియా నుంచి కొత్త SUV మెరిడియన్‌ మోడల్..

Update: 2022-02-24 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీప్ ఇండియా కొత్తగా జీప్ మెరిడియన్ మూడు వరుసల SUV విభాగంలోకి అడుగుపెట్టింది. దీని ద్వారా హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి, MG హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700 వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. జీప్ ఇండియా మెరిడియన్ SUV ని రంజాంగావ్ ఫెసిలిటీలో తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2022 ప్రథమార్థంలో మార్కెట్‌లోకి విడుదల అవుతున్న ఈ మోడల్ ఎస్‌యూవీ దాదాపు 80 శాతం స్థానికంగానే నిర్మించబడుతుంది.

కొత్త జీప్ మెరిడియన్ 173hp 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యూనిట్ 4×2తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఇది 4×2 లేదా 4×4 ఎంపికలతో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, 'మెరిడియన్' అనే పేరు కొన్ని గ్లోబల్ జీప్ పేర్లతో సహా 70 విభిన్న పేర్ల జాబితా నుండి ఎంపిక చేయబడింది. భారతీయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మెరిడియన్ అనే పేరు ఎంచుకోవడం జరిగిందని కంపెనీ తెలిపింది.

మెరిడియన్ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన ఫీచర్లలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), అలెక్సా ఇన్-వెహికల్ ఫంక్షన్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు మొదలైనవి ఉన్నాయి. వైర్‌లెస్‌ కనెక్టివిటీని కలిగి ఉంది. Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మూడవ వరుసలోని ప్రయాణీకులు మెరిడియన్‌లో కూర్చోవడానికి తగినంత స్థలం కూడా ఉంది.

Tags:    

Similar News