హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : జనసేన

Update: 2022-03-04 13:39 GMT
హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : జనసేన
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో :రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు కోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని పార్టీ మండల అధ్యక్షుడు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ, జిల్లా నాయకులు వాసంశెట్టి కుమార్, యడ్ల ఏసుభాస్కరరావులు డిమాండ్ చేశారు. అమరావతిపై హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు.


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారని... కేంద్రం దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు తెలిపారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రైతులు, మహిళలకు నేతలు అభినందనలు తెలిపారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తాటికాయల శ్రీనివాసరావు, నల్లా దుర్గారావు, యడ్లపల్లి రాము, కూనపరెడ్డి రంగా, చినిమెల్లి కొండయ్య, బండి నాగు, బోడపాటి తాతాజి తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News