పుల్వామా మృతులకు సీఆర్‌పీఎఫ్ నివాళులు

Update: 2022-02-14 11:10 GMT

శ్రీనగర్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌‌పీఎఫ్) సిబ్బంది పుల్వామా మృతులకు సోమవారం నివాళులు ఆర్పించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జమ్ముకాశ్మీర్ లెత్పోరా స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. '2019లో ఇదే రోజున(ఫిబ్రవరి 14) పుల్వామాలో అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటున్నాను. వారి శౌర్యం, అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడిని బలమైన, సంపన్న దేశం కోసం పని చేయడానికి ప్రేరేపిస్తుంది' అని ప్రధాని ట్వీట్ చేశారు. దేశం జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. వారికి నివాళులు ఆర్పిస్తున్నట్లు తెలిపారు. సీఆర్‌పీఎఫ్ అడిషనల్ డైరక్టర్ జనరల్(ఏడీజీ) దల్జిత్ సింగ్ చౌదరీ మాట్లాడుతూ.. మేము 2019 పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 సీఆర్‌పీఎఫ్ సైనికులను స్మరించుకున్నాం. మేము ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా అదే ఏడాది పాకిస్తాన్ బాలకోట్ పై వైమానిక దాడులు చేసి, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News