మీ పిల్లలు గేమింగ్ అడిక్షన్‌తో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

దిశ, ఫీచర్స్ : గేమింగ్ అడిక్షన్ లేదా డిసీజ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘బిహేవియర్ ప్యాటర్న్‌’గా పేర్కొంది.

Update: 2022-06-18 09:57 GMT

దిశ, ఫీచర్స్ : గేమింగ్ అడిక్షన్ లేదా డిసీజ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 'బిహేవియర్ ప్యాటర్న్‌'గా పేర్కొంది. ఇది గేమింగ్‌పై బలహీనమైన నియంత్రణకు దారితీస్తుందని వెల్లడించింది. ఈ అడిక్షన్ వల్ల ప్రతికూల పరిణామాలు సంభవించినప్పటికీ ఇతర ఆసక్తులు, రోజువారీ కార్యకలాపాల కంటే కూడా పిల్లలు గేమింగ్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దన్న తల్లిని కాల్చి చంపిన లక్నోకు చెందిన బాలుడు.. రెండు రోజుల పాటు ఆ మృతదేహాన్ని గదిలో దాచిపెట్టడం ఇందుకు ఉదాహరణ. ఇలాంటి బిహేవియర్‌ను సులభంగా తీసుకోకూడదని హెచ్చరిస్తున్న నిపుణులు.. గేమింగ్ అడిక్షన్‌ను మాదకద్రవ్య దుర్వినియోగం కన్నా ప్రమాదమని అంటున్నారు. అంతేకాదు పిల్లలు తమ ఎన్విరాన్మెంట్‌లో అర్థం చేసుకునేది హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుందని, గేమింగ్ ప్రభావాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు.

వార్నింగ్

ఒక పిల్లవాడి గేమింగ్ అడిక్షన్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. 24 గంటలు అదే ధ్యాసలో ఉండిపోవడం వల్ల ఒక నిర్దిష్ట ప్రదేశానికే పరిమితమై.. బహిరంగ కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఇది సామాజిక జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. గేమింగ్ అడిక్టర్.. ఫ్రెండ్స్, పార్టీస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటి సోషల్ గ్యాదరింగ్స్‌ను అవాయిడ్ చేస్తుండటంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది.

గేమింగ్ వ్యసనాన్ని ఎలా నియంత్రించవచ్చు?

* నిపుణుడితో మాట్లాడేందుకు ప్రయత్నించాలి

* వ్యసనానికి మూల కారణాన్ని కనుగొనాలి.

* ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చేయాలి

* ఫ్రెండ్స్, పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు తీసుకెళ్లాలి.

* గేమింగ్‌పై ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నారో వివరించాలి.

* ఇతర హాబీస్ ద్వారా.. గేమింగ్, జీవితంలోని ఇతర విషయాల మధ్య సమతుల్యతను సృష్టించాలి.

తమ పిల్లలు గేమింగ్‌కు బానిసలైతే తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

గేమింగ్‌పై దృష్టిపెట్టి కెరీర్ నాశనం చేసుకుంటున్న పిల్లల గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులు.. పిల్లలను తమ లైఫ్ బ్యాలన్స్ చేసుకునేలా ప్రోత్సహించాలి. కొట్టడం, తిట్టడం కాకుండా వివరంగా చెప్పేందుకు ప్రయత్నించాలి. చుట్టుపక్కల వస్తువులు, మనుషులకు ప్రాధాన్యత ఇస్తే ఎలా ఉంటుంది, లేదంటే లైఫ్ ఏ విధంగా మారిపోతుందో చెప్పాలి.

Tags:    

Similar News