ఇదేనా 'ఫ్రెండ్లీ పోలీసు'.. వికలాంగుడిని అవమానించిన ఏఎస్ఐ..!

దిశ, దోమ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పోలీసులను చూసి భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి latest telugu news..

Update: 2022-03-15 07:47 GMT

దిశ, దోమ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పోలీసులను చూసి భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా వెళ్లే స్నేహపూరిత వాతావరణం కల్పిస్తామంటూ.. సీఎం కేసీఆర్ ప్రకటిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్ధంగా ఉంది. వివరాల్లోకి వెళితే చెన్నయ్య అనే వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం దోమ మండలం గుంముడల్ గ్రామ వాసి బోయిన చెన్నయ్య (వికలాంగుడు)కు వారి తమ్ముళ్లు వెంకటయ్య, కృష్ణయ్య ల మధ్య ఇంటి దగ్గర గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి చెన్నయ్య పోలీసులను ఆశ్రయించాడు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ జయప్రకాష్ ను కోరారు.

అయితే ఎఎస్ఐ వారిపై కేసు నమోదు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. కుంటోడ అని సంబోధిస్తూ, బండ బూతులు తిట్టి పోలీస్ స్టేషన్ నుండి గెంటేసిండని చెన్నయ్య ఆరోపించాడు. ఏఎస్ఐ జయ ప్రకాష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్‌పీఆర్‌డీ సభ్యులు డిమాండ్ చేశారు. పదిమందికి నీతులు చెప్పే పోలీసులే ఇలాంటి పనులు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. వికలాంగులకు రక్షణ కల్పించవలసిన పోలీసులు వికలాంగులను దూషించడం శోచనీయమని, వికలాంగుడిని దూషించిన ఏఎస్ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) దోమ మండల అధ్యక్షుడు ఎం.చుక్కయ్య డిమాండ్ చేశాడు.

Tags:    

Similar News