Minister KTR: గాంధీజీకి మోడీకి అదే తేడా.. మంత్రి కేటీఆర్ సెటైర్లు
Is this Atmanirbharbharat and Vocal4Local, Asks Minister KTR On Twitter| కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించే మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేస్తూ మోడీపై సెటైర్లు వేశారు
దిశ, డైనమిక్ బ్యూరో : Is this Atmanirbharbharat and Vocal4Local, Asks Minister KTR On Twitter| కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించే మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేస్తూ మోడీపై సెటైర్లు వేశారు. స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి నాడు మహాత్మా గాంధీ ఆత్మ నిర్భర్ చిహ్నంగా చరఖాను ఉపయోగిస్తే... నేడు చేనేత, ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీకి ఓ గుర్తింపు దక్కిందని ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు సాధించిన ఆత్మ నిర్భర్ భారత్? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే వోకల్ 4 లోకల్ ఇదేనా? అని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కొత్త నేషనల్ మీడియా ఛానెల్? బీజేపీకి షాకిచ్చేలా వ్యూహం