Prabhas: ప్రభాస్ కు పెళ్లి ధ్యాసే లేదా .. ఆదిపురుష్ సమయంలో ఫ్యాన్స్ కు ఇచ్చిన హామీ ఏమైనట్టు?

ఇంత వరకు వారికీ ఇచ్చిన మాట నెరవేర్చలేదని నెటిజన్స్

Update: 2024-10-23 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లి ఊసే ఎత్తని హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. ఈ రోజు డార్లింగ్ ప్రభాస్ తన 45 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. సినిమాల్లో ఈ యంగ్ రెబల్ స్టార్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడికెళ్లినా డార్లింగ్ ను ఈజీగా గుర్తుపడతారు. బాహుబలి సినిమా తర్వాత రూ.100 కోట్లు బడ్జెట్ సినిమాల తప్ప చిన్న సినిమాలు చేయడం లేదు. తాజాగా, ప్రభాస్ పెళ్లి వార్త మళ్ళీ తెర మీదకు వచ్చింది.

ప్రభాస్ కు అసలు పెళ్లి ధ్యాసే లేదా అంటూ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ఫ్యాన్స్ గట్టి గట్టిగా అరుస్తుంటే అప్పుడు ప్రభాస్ "నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. తిరుపతిలోనే చేసుకుంటా " అని మాట ఇచ్చాడు అయితే, ఇంత వరకు వారికీ ఇచ్చిన మాట నెరవేర్చలేదని నెటిజన్స్ ఆ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. మరో వైపు డార్లింగ్ సన్నిహితులు త్వరలో  పెళ్లి చేసుకుంటాడంటూ చెబుతున్నారు. 

Tags:    

Similar News