Lavanya tripathi: ‘వెల్ కమ్ బుల్లి మెగా హీరో’.. అప్పుడే విషెష్ చెప్పడం స్టార్ట్ చేసిన ఫ్యాన్స్..??

టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అందం, అభినయం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-14 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అందం, అభినయం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సినిమాల్లో నటించే క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన వీరిద్దరు పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి ప్రేమ చిగురించిన చోటే వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా కలిసిమెలసి జీవిస్తోన్న ఈ జంట వివాహనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో-హీరోయిన్ల గురించి తరచూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, దసరా పండుగ నాడు లావణ్య.. తన తల్లితో ఈ శుభవార్త చెప్పినట్లు జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారని ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా దాస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెల్ కమ్ బుల్లి మెగా హీరో అంటూ ఇప్పుడు విషెష్‌లు ప్రారంభించారు కూడా. ఈ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి వివాహం అయ్యాక మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌లో నటించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ క్యూటీ మెగా ఫ్యామిలీలో భాగమై అందరితో కలిసిమెలసి ఉంటుంది. 

Tags:    

Similar News