అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం..

దిశ, ఫీచర్స్: చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా జులై 7న ‘అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం’ జరుపుకుంటారు..Latest Telugu News

Update: 2022-07-07 05:16 GMT

దిశ, ఫీచర్స్: చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా జులై 7న 'అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం' జరుపుకుంటారు. 1550 జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారు చేసినట్లు ఆధారాలుండగా.. మొదటిసారి 2009 జులై 7న చాక్లెట్ దినోత్సవం అధికారికంగా ప్రకటించబడింది.

ఇక ఈ చాక్లెట్ డేను పశ్చిమ ఆఫ్రికాలోనే అతిపెద్ద ఉత్పత్తి దేశమైన 'ఘనా'లో మాత్రం ఫిబ్రవరి 14న, 'లాట్వియా'లో జులై 11న నిర్వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో జనవరి 10న బిట్టర్‌స్వీట్ 'చాక్లెట్ డే'గా, జులై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి పేర్లతో నిర్వహించుకుంటారు.


Similar News