పెళ్లి, రిలేషన్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-11-04 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebba Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. మరికొన్ని మూవీస్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. గత కొద్ది రోజుల నుంచి సరిగా ఒక్క హిట్ కూడా పడట్లేదు. తాజాగా మళ్లీ ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. చేతన్ కృష్ణ(Chetan Krishna), హెబ్బా కలిసి ధూం ధాం(Dhoom Dham) చిత్రంలో నటించారు. ఇందులో వెన్నెల కిషోర్(Vennela Kishore), సాయి కుమార్(Sai Kumar), గోపరాజు రమణ(Goparaju Ramana), పృథ్వీ రాజ్ దితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ (Friday Frame Works Banner)  పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మచ్చా(Sai Kishore Maccha) తెరకెక్కించారు. అలాగే స్టార్ రైటర్ గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. తాజాగా ధూం ధాం మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడారు.

బ్లాక్ బస్టర్ చిత్రం బేబీ(Baby) సినిమాను తెరకెక్కించిన సాయి రాజేష్ ఫోన్ చేసి ధూం ధాం సినిమా స్టోరీ గురించి చెప్పారని తెలిపింది. మంచి ఎంటర్‌టైన్మెంట్ పాత్రలో అవకాశం వచ్చిందని ఓకే చెప్పానని వెల్లడించింది. పైగా ఇలాంటి పాత్రలో నటించి చాలాకాలం అయ్యిందని పేర్కొంది. అందుకే వెంటనే అంగీకరించానని హెబ్బా చెప్పుకొచ్చింది. ఈ మూవీలో నా రోల్ నేమ్ సుహానా(Suhana) అని వెల్లడించింది. చాలా బబ్లీ గర్ల్ రోల్ అని, ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ హీరో కలుస్తాడని వివరించింది. ఈ రోల్ చాలా ఈజీగా అనిపించిందని హెబ్బ చెప్పుకొచ్చింది. ఇక హీరో చేతన్ చాలా సైలెంట్‌గా ఉంటాడని, నేను చాలా యాక్టివ్‌గా ఉంటానని తెలిపింది.

ఎవరూ చిన్నా,పెద్దా అని చూసుకోలేదని, కేవలం కెమెరా ముందు ఎలా ఫర్మార్మ్ చేశామన్నదే చూసుకున్నామని పేర్కొంది. అలాగే మూవీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారని, కానీ అందరితో కాంబినేషన్ సన్నివేశాలు పడలేదని వెల్లడించింది. అలాగే హెబ్బా మ్యారేజ్, రిలేషన్స్ గురించి మాట్లాడింది. గతంలో పెళ్లి చేసుకోనని అనే మాట మీద ఇంకా నిలబడే ఉన్నానని తెలిపింది. నేను చేసుకొందామన్నా..కరెక్ట్ అబ్బాయి దొరకట్లేదని వెల్లడించింది. ఒక అబ్బాయి దొరకాలని, రిలేషన్ లో ఉండాలని చెప్పింది. అన్ని ఓకే అనుకున్నప్పుడే మ్యారేజ్ గురించి మాట్లాడడం మంచిదని హెబ్బా పటేల్ చెప్పుకొచ్చింది.


Read more ...

అనుష్క శెట్టి ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దానికి ముహూర్తం ఫిక్స్




Tags:    

Similar News