100 దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్న ఇండిగో

దిశ,వెబ్‌డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ మార్చి 27, 2022 నుండి కీలకమైన దేశీయ..telugu latest news

Update: 2022-03-26 13:18 GMT
100 దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్న ఇండిగో
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ మార్చి 27, 2022 నుండి కీలకమైన దేశీయ మెట్రో నగరాలు, ప్రాంతీయ కేంద్రాలను కలుపుతూ 100 విమానాలను ప్రారంభించనుంది. అదే రోజున ప్రయాగ్‌రాజ్-లక్నో నుండి ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (RCS) మార్గాన్ని ప్రారంభిస్తుంది. మరిన్ని 16 ప్రత్యేక విమానాలను కూడా తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. పునః ప్రారంభించబడిన మార్గాల ద్వారా దేశీయ కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, నగర-నిర్దిష్ట ప్రయాణ అవసరాలను తీర్చగలవని, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మార్గాలను కూడా అందిస్తామని ఇండిగో అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇండిగో వద్ద 275 కి పైగా విమానాలున్నాయి. ఎయిర్‌లైన్ 73 దేశీయ, 24 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతూ 1,500 రోజువారీ విమానాలను నడుపుతోంది.

Tags:    

Similar News