ఇండియన్ వెల్స్ టైటిల్ విన్నర్‌గా టేలర్ ఫ్రిట్జ్..

కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్ టైటిల్‌ను అమెరికాకు చెందిన 20వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్- latest Telugu news

Update: 2022-03-21 16:31 GMT

కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్ టైటిల్‌ను అమెరికాకు చెందిన 20వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ ఎగరేసుకపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4వ సీడ్ నదాల్‌పై 6-3, 7-6 సెట్ల తేడాతో ఫ్రిట్జ్ విజయం సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారిగా ఇండియన్ వెల్స్ మాస్టర్ టైటిల్‌-1000ను 24 ఏళ్ల అమెరికన్ అందుకున్నాడు. ఇకపోతే 35 ఏళ్ల స్పానిష్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నదాల్ తన కెరీర్‌లో 37వ మాస్టర్ టైటిల్‌ను తృటిలో జారవిడుచుకున్నాడు. 2 గంటలకు మించి సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతూనే టైటిల్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, ఫ్రిట్జ్ తన పాత ప్రత్యర్థి నదాల్‌ను వరుస సెట్లలో అధిగమించి విజయం సాధించాడు. కాగా, ఈ టోర్నీలో రఫా బ్రేక్ పాయింట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యాడు. మొత్తం 10 బ్రేక్ పాయింట్లలో 2 మాత్రమే రఫా తనకు అనుకూలంగా మార్చుకోగా, ఫ్రిట్జ్ మాత్రం 9 పాయింట్లలో నాలుగింటిని తనకు అనుకూలంగా మార్చుకుని టైటిల్ విజేతగా నిలిచాడు.

Tags:    

Similar News