2 బిలియన్ వ్యాక్సినేషన్ మార్కును దాటిన భారత్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ ఏ విధంగా ప్రపంచం అంతా

Update: 2022-07-17 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ ఏ విధంగా ప్రపంచం అంతా పంచబడిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ డోస్‌ల ప్రకారం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వ్యాక్సిన్ ఇస్తూ వచ్చింది.

భారత్ లో జనవరి 16 2021 న టీకాలు వేయడం ప్రారంభించగా సుదీర్ఘంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ 18 నెలలకే 2 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు వేసినట్లు CoWIN డేటా తెలుపుతుంది. ఇందులో మొదటి డోస్ 1,01,90,73,891, రెండవ డోస్ 92,59,26,880, ప్రికాషన్ డోస్ 5,50,14,860, మొత్తం ఇప్పటి వరకు భారత ప్రభుత్వం 2,00,00,15,631 డోసుల వ్యాక్సిన్ ప్రజలకు అందించినట్లు తెలుస్తుంది.


Similar News