Amit Shah: విపత్తు నిర్వహణలో ప్రపంచంతో సమానంగా భారత్

న్యూఢిల్లీ: భారత్‌ విపత్తు నిర్వహణలో ప్రపంచ దేశాలతో సమానంగా ఉందని..telugu latest news

Update: 2022-04-07 12:47 GMT

న్యూఢిల్లీ: భారత్‌ విపత్తు నిర్వహణలో ప్రపంచ దేశాలతో సమానంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పలు సందర్భాల్లో చాలా దేశాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పారు. గురువారం కెపాసిటీ బిల్డింగ్ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్ 2022 వార్షిక సదస్సులో ఆయన‌ మాట్లాడారు. మనం విపత్తు నిర్వహణలో చాలా దూరం ప్రయాణించాం. పునరావాస-కేంద్రీకృత విధానం 90ల దశాబ్దానికి ముందు ఉంది. విపత్తుకు ముందే మనం సమాచారం తెలుసుకునే దశకు వచ్చాం. సమాచారం ముందే తెలియడంతో ప్రాణాలు కాపాడటం, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణలో మనం ప్రపంచంలోని చాలా దేశాలతో సమానంగా ఉన్నాం. అంతేకాకుండా మరికొన్ని దేశాల కన్నా ముందంజలో ఉన్నాం. ఇది ఆనందించ‌దగ్గ విషయం' అని అన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం విపత్తుల సమయంలో మరణాల రేటును చాలా వరకు తగ్గించిందని అన్నారు. పలు సందర్భాల్లో దిగువ స్థాయికి సమాచారాన్ని చేరవేయడం మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే, విపత్తు నిర్వహణతో ముడిపడి ఉన్న అన్ని ఏజెన్సీల మధ్య సరైన సమన్వయం లేకుంటే వృత్తిపరమైన నైపుణ్యం సాధించలేమని చెప్పారు. రాష్ట్ర, దేశీయ విపత్తు నిర్వహణ బలగాల మధ్య అంతరాన్ని భర్తీ చేయాలని అన్నారు.

Tags:    

Similar News