సాధారణ ప్రసవాలకు ఇన్సెంటివ్స్​ : మంత్రి హరీష్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ దవాఖానాల్లో జరిగే సాధారణ ప్రసవాలకు ఇన్సెంటివ్స్​ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు

Update: 2022-04-05 15:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ దవాఖానాల్లో జరిగే సాధారణ ప్రసవాలకు ఇన్సెంటివ్స్​ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ప్రకటించారు. వైద్యులు, నర్సులకు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సూప‌ర్‌వైజ‌రీ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీహెచ్‌సీ స్థాయిలోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం ఎన్​రోల్​ చేసుకోవాలన్నారు. ప్రతీ పీహెచ్‌ సీలో పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. మందులు లేవనే మాట వస్తే చర్యలు ఉంటాయన్నారు. కావాల్సిన ఇండెంట్‌లు ఎప్పటికప్పుడు పెట్టుకోవాలన్నారు. జిల్లా డీఎమ్‌హెచ్‌‌వో‌లు నిత్యం పీహెచ్‌‌సీలను తనిఖీలు చేయాలని సూచించారు. గ‌ర్బిణీలకు వైద్య సేవ‌లు, వ్యాక్సినేష‌న్‌, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌, మందులు, పరీక్షలు త‌దిత‌ర అంశాల్లో ఎక్కడా లోపం రాకూడదన్నారు. ప్రాథ‌మిక స్థాయిలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించ‌డం వ‌ల్ల తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు రావన్నారు. మందుల కోసం బ‌య‌టికి రాస్తే చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉంటూ వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాల‌న్నారు. 24 గంట‌లు న‌డిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను సైతం అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో ఎప్పటికప్పుడు వివ‌రాలు అప్‌లోడ్ చేయాల‌న్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్ పక్కాగా చేస్తూ, టి- డ‌యాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాల‌న్నారు. 

కొత్త భవనాలు..

పాత పీహెచ్‌సీల స్థానంలో అవ‌స‌ర‌మైతే కొత్త నిర్మాణాలు చేస్తామ‌ని, పెద్ద మొత్తంలో మరమ్మత్తులు ఉన్న పీహెచ్‌సీల్లో వెంట‌నే రిపేర్లు మొద‌లు పెడ‌తామ‌ని మంత్రి అన్నారు. దీనికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. డీఎంహెచ్‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ఇంజినీర్లు పరిశీలించి వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపించాల‌ని ఆదేశించారు. పీహెచ్‌సీ, స‌బ్‌సెంట‌ర్ స్థాయిలో వైద్య సేవ‌లు అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. సాంక్రమిక, అసాంక్రమిక, జీవ‌న శైలి వ్యాధుల పై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌ లో హెల్త్ సెక్రెట‌రీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ‌, సంక్షేమ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, డైరెక్టర్​ ఆఫ్ హెల్త్ జి శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధ‌ర్‌, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్​ రెడ్డి, వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్ అజ‌య్‌ కుమార్, డీఎంఇ ర‌మేష్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News