నారాయణపేట జిల్లాలో కరెంట్ కట్.. ఆ కార్యాలయల్లో రోజుకు లక్షల ఆదాయం అవుట్

దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన..latest telugu news

Update: 2022-03-28 12:09 GMT

దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన రెండు నెలల విద్యుత్ బిల్లు బకాయి ఉన్నందున ఆఫీస్ కు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. కరెంటు లేక రిజిస్ట్రేషన్ పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి దాదాపు లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోతుందని రిజిస్టర్ ఆఫీస్ రాజేష్ కుమార్ అన్నారు.

రెండు నెలలకు గాను రూ.7194 బిల్లులను మక్తల్ ఎస్టీవో కార్యాలయంలో పెండింగ్ ఉందని, మక్తల్ ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో విద్యుత్ కార్యాలయానికి బకాయి బిల్లు చేరకపోవడంతో విద్యుత్ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. ఇది ఇలా ఉండగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తాత్కాలికంగా కరెంట్ సప్లై కోసం ఇన్వెంటర్ బాక్స్ లు ఉన్నా.. వాటిపై రిజిస్ట్రేషన్ అధికారుల శ్రద్ధ లేక.. నిర్లక్ష్యం చేయడంతో అవి మూలనపడ్డాయి. దీంతో తాత్కాలికంగా పవర్ సప్లై లేకుండా పోయింది. ఈ రెండు డిపార్ట్మెంట్ల నిర్లక్ష్యం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన క్రయ విక్రయ దారులు ఎండలో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై మక్తల్ రిజిస్ట్రేషన్ అధికారిని వివరణ కోరగా కరెంటు బకాయిలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ కార్యక్రమంలో సబ్మిట్ చేసిన బిల్లులు అప్రోవల్స్ కాలేదని దీనివల్ల సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేదని అందుకు కార్యాలయానికి కరెంటు కనెక్షన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఈ విషయాన్ని డీఈకి రిక్వెస్ట్ లెటర్ పెట్టిన స్పందించలేదని రిజిస్ట్రేషన్ అధికారి తెలిపారు.



Tags:    

Similar News