రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు కలకలం రేపాయి. మావోయిస్టులు, కేంద్ర పారామిలిటరీ మధ్య బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కే మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో సిబ్బంది అప్పారావు గాయపడినట్లు వెల్లడించారు. బీజాపూర్‌లోని ఉసూర్ బ్లాక్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్లు సూపరిండెంట్ పోలీసు కమ్లోచన్ కశ్యుప్ తెలిపారు. సిబ్బంది రోడ్డు పహారాలో ఉన్నప్పుడు మావోయిస్టులు దాడి చేసినట్లు చెప్పారు. వెంటనే అదనపు బలగాలు ఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి 60 కిలోమీటర్ల దూరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.