ఆసిఫాబాద్‌లో RRR సినిమా డైరెక్టర్ రాజమౌళి సందడి

దిశ, తాండూర్: కొమరం భీమ్ - In Asifabad, director Rajamouli and his wife made a fuss after watching the RRR movie

Update: 2022-04-12 10:36 GMT
ఆసిఫాబాద్‌లో RRR సినిమా డైరెక్టర్ రాజమౌళి సందడి
  • whatsapp icon

దిశ, తాండూర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం RRR డైరెక్టర్ రాజమౌళి, అతని భార్య రమ సందడి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఢిల్లీకి చెందిన పిక్చర్ టైం, జిల్లా మహిళా సమాఖ్య భాగస్వామ్యంతో రూ.60 లక్షల వ్యయంతో, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన గాలి బుడగల మినీ థియేటర్ ను పరిశీలించారు. ఈ మేరకు రాజమౌళి దంపతులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, పలువురు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.


రాజమౌళి దంపతులు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధికారులు, కొమరం భీమ్ కుటుంబ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు ప్రేక్షకులతో కలిసి రాజమౌళి దంపతులు RRR సినిమాను చూశారు. ప్రముఖ డైరెక్టర్ రావడం తో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు పోటీపడ్డారు.



Tags:    

Similar News