కీసరలో ఏప్రిల్‌ 8న 'ఇంపల్స్​2022'

బాలవికాస ఇంటర్నేషనల్​సెంటర్, తెలంగాణ స్టేట్​ఇన్నోవేషన్​సెల్ సమన్వయంతో కీసరలో ‘ఇంపల్స్​2022’

Update: 2022-03-17 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బాలవికాస ఇంటర్నేషనల్​సెంటర్, తెలంగాణ స్టేట్​ఇన్నోవేషన్​సెల్ సమన్వయంతో కీసరలో 'ఇంపల్స్​2022' పేరిట సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్‌ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈమేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్​గురువారం తన కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదస్సు స్టార్టప్‌ల ప్రదర్శనలకే పరిమితం కాకుండా సామాజిక పెట్టుబడిదారులు, సంస్థలను ఒకేచోట చేర్చడం వల్ల ఎకోసిస్టంను మరింత పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు.

ఇదిలా ఉండగా టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టీఐఎస్‌ఎస్‌, ముంబై), ఐఎస్‌బీకి చెందిన ఐ-వెంచర్‌, టీ-హబ్‌, వీ-హబ్‌, కాకతీయ శాండ్‌బాక్స్‌ తదితర సంస్థలు కూడా ఈ సదస్సుకు సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. 50కిపైగా సంస్థలతోపాటు సామాజిక ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు పాల్గొని, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News