వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటిలో రిఫ్రిజిరేటర్ అనేది కామన్ అయిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటిలో రిఫ్రిజిరేటర్ అనేది కామన్ అయిపోయింది. దీని వలన ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే కూడా వాటిని స్టోర్ చేసుకుని తింటున్నారు. ఇలా తినడం వలన అనారోగ్యసమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. చల్లటి నీరుతాగడం, ఆహార పదార్థలు స్టోర్ చేసి తినడం ఎక్కువైపోయింది. అయితే సమ్మర్‌లో ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వేసవిలో చల్లని నీరు తాగడం అనేది ప్రమాదం.. వేసవిలో కూల్ వాటర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, బయట కొనుక్కొని మరీ కూల్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ఈ చల్లని వాటర్ దాహం తీర్చినా, తరువాత ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వైద్యులు. చల్లని నీరు తాగడం కారణంగా జలుబు, దగ్గు మాత్రమే కలుగుతుంది అనుకుంటే అది తప్పు.. అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అదే పనిగా మనం చల్లటి నీరు తాగినట్లయితే.. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి , వికారం, మలబద్దకం , లాంటి సమస్యలు సంభవిస్తాయి.
శీతల కాలంలో కూల్ వాటర్ అధికంగా తాగటం వలన మెదడుకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. చల్లని నీరు తాగడం వలన వెన్నెముక సున్నితమైన నరాలను చల్లబరుస్తాయి, ఇది మెదడు పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల తల నొప్పి, సైనస్ సమస్యలు వస్తాయి.
హృదయ స్పందన..
మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు , జీవ వ్యవస్థను నియంత్రించే వాగస్ అనే ఒక నాడి మన శరీరంలో ఉంటుంది. దీని కారణంగా చల్లని నీరు తాగితే నరాల త్వరగా చల్లబడి గుండె వేగం, పల్స్ మందగించే అవకాశం ఉంది.
శరీరంలో కొవ్వు తగ్గాలంటే, కూల్ వాటర్‌కు దూరంగా ఉండాల్సిందే..
శరీరంలో కొవ్వును కోల్పోవాలని ప్రయత్నాలు చేసే వారు కూల్ వాటర్‌కు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ నీరు కొవ్వును గట్టిపరుస్తుంది. ఇందు కారణంగా బరువు తగ్గాలని ప్రయత్నం చేసేవారు కూల్ వాటర్‌కు దూరం ఉండాల్సిందే.
వ్యాయామం తర్వాత..
వ్యాయామం తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఎండ కాలంలో వ్యాయమం తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఎందుకంటే బాడీలో మరింత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది దీర్ఘకాలిక కడుపు నొప్పికి దారితీస్తుంది.
గొంతు ప్రమాదం..
చల్ల నీరు తాగడం కారణంగా గొంతు సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు తాగితే అదనపు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది శ్వాస కోశ ప్రమాదకర పొరను ఏర్పరుస్తుంది. అది అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.