ఏఐ ఫ్రీ ఆన్‌లైన్ కోర్స్ ఆఫర్ చేస్తున్న ఐఐటీ-పాలక్కాడ్!

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పాలక్కాడ్ ఓన్ ప్లాట్‌ఫామ్ NPTEL (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్)లో కృత్రిమ మేధస్సు (AI)పై 12 వారాల ఆన్‌లైన్ కోర్సును ఉచితంగా అందిస్తోంది.

Update: 2022-07-20 14:25 GMT

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పాలక్కాడ్ ఓన్ ప్లాట్‌ఫామ్ NPTEL (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్)లో కృత్రిమ మేధస్సు (AI)పై 12 వారాల ఆన్‌లైన్ కోర్సును ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 'అప్లయిడ్ యాక్సిలరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనే సబ్జెక్ట్‌పై బోధించబోతోంది. తద్వారా హెల్త్‌కేర్, స్మార్ట్ సిటీ డొమైన్స్ వంటి పారిశ్రామిక వినియోగ సందర్భాల్లో AI-బేస్డ్ సొల్యూషన్స్ అమలు చేసేందుకు అవసరమైన కంప్యూట్ సామర్థ్యాలు, సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను కవర్ చేయనుంది. 

తెలుసుకోవలసిన విషయాలు:

* 12 వారాల ఉచిత కోర్సును హుబ్లీలోని KLE టెక్నలాజికల్ యూనివర్శిటీలో సెంటర్ ఫర్ హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెడ్ ప్రొఫెసర్ సత్యధ్యన్ చికెరూర్ నిర్వహిస్తారు.

* ఈ కోర్సుకు అప్లయ్ చేసే అభ్యర్థులు కంప్యూటర్ ఆర్గనైజేషన్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ గురించి ముందస్తు పరిజ్ఞానం కలిగి ఉండాలి.

* అన్ని స్ట్రీమ్‌లకు చెందిన ఇంజినీరింగ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ సహా థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా దీనికి హాజరు కావచ్చు.

* ఏఐ సిస్టమ్ హార్డ్‌వేర్‌, ఏఐ యాక్సిలరేటర్స్, జీపీయూ కంటైనర్స్, ఐడీఈ, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, క్లౌడ్ మొదలైన సబ్జెక్ట్‌లను కవర్ చేయనున్నారు.

* సర్టిఫికేట్ కావాలనుకుంటే మాత్రం రూ. 1,000 రుసుముతో పరీక్షకు నమోదు చేసుకోవాలి. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు NPTEL, IIT మద్రాస్ లోగోలతో కూడిన సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:

కోర్సు ప్రారంభం: జూలై 25

కోర్సు ముగిసే తేది: అక్టోబర్ 14

నమోదుకు చివరి తేదీ: ఆగస్టు 1

పరీక్ష: అక్టోబర్ 29

Tags:    

Similar News