ఇలా చేసినోడు ఈ పాటికే సచ్చిపోయి ఉండాలి.. లేదు అంటే తొందర్లో కుక్క చావు చస్తాడు.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ వీడియో
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Madhavilatha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Madhavilatha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం రాజకీయాల్లో స్థిరపడింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మాధవీలత ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ‘అంటే అన్నామంటారు.. అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో' అని ఓ వీడియో యాడ్ చేసింది.
ఇక ఆ వీడియోలో ఒకతను వీడియో తీస్తుండగా.. మరో వ్యక్తి.. ఫస్ట్ బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దానిమీద టాయిలెట్ కూడా చేశాడు. ఇక ఇదంతా వీడియో తీస్తున్న వ్యక్తి నవ్వడం గమనార్హం. అయితే ఈ వీడియో పై స్పందిస్తూ మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ‘ మన బసవన్న పై కాళ్లు కడుకుంటున్నారు, అలాగే ఉచ్చ కూడా పోశారు. పైగా వీడియో తీసిన వాడు కిక్కిక్కి అని నవ్వుతున్నాడు. ఏం పర్లేదు ఏదో ఒకరోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడిచేస్తది.. అంతే కర్మ అనుభవించాలి.. లేదా ఏ యాక్సిడెంట్‌లోనో నీ కాళ్లు పోతాయి.
అయ్యో భగవంతుడా.. అయ్యో ప్రభువా..అంటూ వాళ్ల దేవుణ్ణి తలుచుకుంటూ నేను ఏం పాపం చేశాను అని అనుకుంటే ఆ రోజు నువ్వు చేసిన పాపం నీకు గుర్తుకు వస్తుంది. ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లలకు కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం తాతలు చేసిన పాపాలు తండ్రులు వాళ్ళ పిల్లలు, పిల్లలకు కూడా వస్తాయి. కాబట్టి రేపు నీకు పుట్టే పిల్లలు ఏ కాలు లేకుండానో పుట్టవచ్చు, లేదంటే వాళ్లు కష్టాలు అనుభవించవచ్చు. కానీ పక్కాగా వీటిల్లో ఏదో ఒకటి అనుభవించక తప్పదు.
గుడి బయట చాలా మంది కుష్టు రోగులు, రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లను చూసి మనం.. అయ్యో దేవుడికి మనసే లేదని అనుకుంటాము కదా కానీ దేవుడికి మనసుంది, నువ్వు చేసే పాపాలకి లెక్క కూడా ఉంటుంది. వాడు అలా గుడి బయట అడుక్కుంటున్నాడంటే వాడు పోయిన జన్మలో ఎన్ని పాపాలు చేసి ఉంటాడో.. ఎంత మంది ఉసురు పోసుకొని ఉంటాడో అందుకే ఈ జన్మలో ఇలా అడుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు వీడికి కూడా అదే జరుగుతుంది. ఏం పర్లేదు ఇప్పుడు నవ్వి నోడు, కడుక్కున్నోడు కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.