Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఫిక్స్.. ఆనందంలో ఫ్యాన్స్

గతేడాది ‘పుష్ప-2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

Update: 2025-04-13 09:10 GMT
Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఫిక్స్.. ఆనందంలో ఫ్యాన్స్
  • whatsapp icon

దిశ, సినిమా: గతేడాది ‘పుష్ప-2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే కోలీవుడ్ (Kollywood) స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో కూడా ఓ పాన్ ఇండియా మూవీ లైన్‌లో పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే.. అట్లీ, అల్లు మూవీపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. వీరి కాంబోకు సంబంధించి ఎదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు.. బాలీవుడ్ (Bollywood) యంగ్ బ్యూటీస్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్. ఈ ఇద్దరి బ్యూటీస్‌ను అల్లు, అట్లీ సినిమాలో హీరోయిన్స్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా.. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటు హీరోయిన్స్ అప్‌డేట్ కూడా ఒకేసారి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే కియారా అద్వానీ (Kiara Advani) ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ చేంజర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా.. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. త్వరలో రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘దేవర పార్ట్ 2’తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఇలా ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తున్నారనే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News