Sri Vishnu: బూతులు మాట్లాడుతూ సెన్సార్ నుంచి తప్పించుకుంటున్న శ్రీవిష్ణు.. ఆయన రియాక్షన్ ఏంటంటే? (వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sri Vishnu) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Update: 2025-04-29 12:38 GMT
Sri Vishnu: బూతులు మాట్లాడుతూ సెన్సార్ నుంచి తప్పించుకుంటున్న  శ్రీవిష్ణు.. ఆయన రియాక్షన్ ఏంటంటే? (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sri Vishnu) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది స్వాగ్(Swag), ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ రెండు మూవీస్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‘సింగిల్’ (Single)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను కార్తీక్ రాజు(Karthik Raju) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ బ్యానర్స్‌పై విద్యాకొప్పినీడి, భాను ప్రతాప్(Bhanu Pratap), రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఇవానా, కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తు్న్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో పాల్గొన్న శ్రీవిష్ణుకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇందులో ఓ రిపోర్టర్ మీ చిత్రాల్లో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి అని అడిగింది. అలాగే ఇటీవల కొన్ని సినిమాల్లో బూతులు మాట్లాడారని కొన్ని వీడియోలు వైరలయ్యాయి. ఆ పదాలు అర్థం కాకుండా వేగంగా మాట్లాడుతూ సెన్సార్ నుంచి తప్పించుకుంటారని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. దానికి శ్రీవిష్ణు స్పందిస్తూ.. ‘‘నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. అవి సంస్కృత పదాలు. ఇప్పుడు ఉన్నపళంగా అందరికీ సంస్కృతం నేర్పించలేం కదా’’ అని చెప్పుకొచ్చి కౌంటర్ ఇచ్చాడు. 

Tags:    

Similar News

Bhagyashri Borse

Bhagyashri Borse