ఫస్ట్ టైం బికినీ వేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్న తెలుగమ్మాయి తేజస్వి మడివాడ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్న తెలుగమ్మాయి తేజస్వి మడివాడ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ బ్యూటీ త్వరలో ‘అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్‌లో ఈ ముద్దుగుమ్మ బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్‌లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తేజస్విని బికినీ వేయడంపై ఓ యూట్యూబ్ యాంకర్ ఆ బికినీలో పర్ఫెక్ట్ గా కనిపించడానికి ఫిట్నెస్ జర్నీ ఏమైనా చేశారా అని ప్రశ్నించగా దాని గురించి తేజస్వి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. "ఆర్మీ సినిమాలకు, మేరీకోమ్ లాంటి సినిమాలకే కష్టపడి బాడీ పెంచాలి. మిగిలిన వాటికి అవసరం లేదు అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి యాక్టర్‌కి అందంగా ఉండటం, బాడీ ఫిట్‌గా ఉండటం అవసరం. స్క్రీన్‌లో నార్మల్‌గా కంటే ఇంకా బాగా కనిపిస్తాము. చిన్న యాక్టర్ నుంచి పెద్ద స్టార్స్ వరకు అందరూ కష్టపడతారు. నాకు మొదటి సారి అవకాశం వచ్చింది నేనేంటో చూపించడానికి. స్క్రిప్ట్ నేను రాయలేదు, వాళ్ళు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అప్పటికే నేను ఫిట్నెస్ జర్నీలో ఉన్నాను. ఏదైనా డ్రెస్ వేసుకుంటే బాగుండాలి, వేసుకున్న తర్వాత ఛీ నేను ఇలా ఉన్నాను ఏంటి అని ఓ పదేళ్ల తర్వాత నేను అనుకోకూడదు. తెలుగు సినిమాలో మొదటిసారి నేను బికినీ వేసుకున్నాను. నేను ఇది ఒక గొప్ప అవకాశంలా భావిస్తున్నాను. నా కష్టం చూపించాను అనిపిస్తుంది. అంత ఫిట్‌గా ఉన్నాము అంటే నా క్రమశిక్షణ తెలుస్తుంది. ఈ సిరీస్‌లో నా క్రమశిక్షణ చూపించే అవకాశం వచ్చింది. అయినా నేను ఊరికే బికినీ వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదు. సినిమాలో సన్నివేశం కోసం చేశాను అని తేజస్విని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
(video link credits to tejaswi madivada instagram id)