Suriya: కార్తీని చూస్తే నాకు అసూయ కలుగుతుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్ (వీడియో)

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’.

Update: 2024-10-27 08:19 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దీనిని డైరెక్టర్ శివ(Shiva) తెరకెక్కించగా.. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్(UV Creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, సూర్య ప్రమోషన్స్‌లో భాగంగా రియాలిటీ బిగ్‌బాస్(Bigg Boss) షోలో పాల్గొని తన తమ్ముడు కార్తీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘నాకు కొంచెం మాత్రమే తెలుగు వచ్చు. నేను పూర్తిగా మాట్లాడలేను. ఈ విషయంలో నాకు కార్తీ(Karthi)ని చూస్తే నిజంగా ఈర్ష్య, అసూయ కలుగుతాయి. వాడు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతాడు. అతడు తమిళనాడులో ఉన్న వారితో కూడా తెలుగులో మాట్లాడడంతో పాటు సాంగ్స్ కూడా పాడతాడు. అతనికి సినిమా అంటే ప్రాణం’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News