అది లేకుండా బికినీ పిక్చర్ పోస్ట్ చేయలేను: మృణాల్

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన స్టైల్‌కు సంబంధించి..I don have courage to post a picture in a bikini : Mrunal

Update: 2022-04-03 06:38 GMT
అది లేకుండా బికినీ పిక్చర్ పోస్ట్ చేయలేను: మృణాల్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన స్టైల్‌కు సంబంధించి అనేక ఎక్స్‌పరిమెంట్స్ చేస్తుంటుంది. ట్రెడిషనల్, ట్రెండీ, స్కిన్ ఫిట్.. ఇలా ఎలాంటి అవుట్‌ఫిట్స్‌‌ ధరించినా కూల్ లుక్‌తో అదరగొడుతుంది. కానీ ఒక్క బికినీ ధరించడంలో మాత్రం అసౌకర్యానికి గురవుతానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇందుకు గల కారణాన్ని చెప్పుకొచ్చిన 'ధమాకా' యాక్ట్రెస్.. 'భారతదేశం ఇంకా అన్ని రకాల శరీరాలను నార్మలైజ్ చేయలేదని భావిస్తున్నాను. ఇప్పటికి కూడా బీచ్‌కు వెళితే మనం పరిపూర్ణమైన శరీరాన్ని కలిగి ఉండాలనే భావిస్తాం. కానీ అక్కడున్న అమ్మాయిలను నేను ఈ విధంగా ప్రేరేపించాలనుకోవడం లేదు' అని అభిప్రాయపడింది. 'కొంచెం పొట్ట ఉన్నా పర్వాలేదు గానీ ఫిట్‌గా ఉండాలి. గతంలో ఇలాంటి ఫీచర్స్‌తో కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ బికినీ ధరించిన అప్పటి చిత్రాన్ని పోస్ట్ చేయాంటే కొంచెం ధైర్యం కావాలి. ప్రస్తుతం అందుకు సిద్ధమవుతున్నాను.

Tags:    

Similar News