‘నేను చాలా అదృష్టవంతురాలిని’.. బ్రేకప్ తర్వాత స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-19 05:44 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ నిత్యం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా మలైకా తండ్రి చనిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇలా పలు వార్తలతో ఆమె నెట్టింట నిలుస్తూనే ఉంటోంది. అలా వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ తాజాగా స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా.. తన జీవితం గురించి అలాగే ఆమెకు ఎదురైన సవాళ్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంలో నా కుటుంబం, స్నేహితులు, నా పని కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నా చుట్టూ ఉన్న వ్యక్తులు బలంగా ఉండటానికి నాకు చాలా సహాయం చేస్తారు. నా స్నేహితులు లేకుండా నేను లేను. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నాకు మద్దతు ఇస్తారు, నాకు స్ఫూర్తినిస్తారు. వాళ్లే నాకు సర్వస్వం’’ అని మలైకా ఎమోషనల్ అయ్యింది. కాగా కరీనా కపూర్, కరిష్మా కపూర్, సోదరి అమృతా అరోరా మలైకాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.

అదే విధంగా ఈ భామ తాను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి మాట్లాడుతూ.. “నా వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నన్ను తీర్చిదిద్దింది. నేను ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నాను. అలాగే కొన్ని కొన్ని విషయాలు మారినందుకు నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. కాగా మలైకా, అర్జున్ 2018 లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ, గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారనే చర్చ నెట్టింట సాగుతోంది.

Tags:    

Similar News