రిజిస్ట్రేషన్ శాఖకు.. దండిగా ఆదాయం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్ - Huge revenue this year through stamps and registration

Update: 2022-03-31 17:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఏడాది భారీగా ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అంచనా వేసినట్టుగానే ఆదాయం రెట్టింపు అయింది. మార్కెట్​ధరల పెంపుతో రాబడి పెరిగింది. ఒకే ఏడాది ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ.12,364 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది.


ఇందులో సేల్స్​డీడీల ద్వారా రూ. 8,364 కోట్లు, మార్టిగేజ్​ద్వారా రూ. 2030 కోట్లు వచ్చాయి. అంతకు ముందు 2020–21లో వచ్చిన ఆదాయం రూ. 5260 కోట్లు మాత్రమే. కానీ ఈసారి రెండింతలు వచ్చింది. ఇక మార్చి నెలలో రూ. 1501 కోట్లు సమకూరాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 3,513 కోట్లు రాగా, మేడ్చల్​ నుంచి రూ. 1987 కోట్లు వచ్చాయి.

Tags:    

Similar News