Quit Smoking: స్మోకింగ్ హ్యాబిట్ వదల్లేకపోతున్నారా..? ఇలా చేసి చూడండి

Easy Ways To Quit Smoking| 'ధూమపానం శరీర అవయవాలకు హాని కలిగించే అనేక వ్యాధులకు మూల కారణం' అని తెలిసిందే. ఈ దురలవాటును వదిలించేందుకు పొగరాయుళ్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ.

Update: 2022-06-23 06:16 GMT

దిశ, ఫీచర్స్ : Easy Ways To Quit Smoking| 'ధూమపానం శరీర అవయవాలకు హాని కలిగించే అనేక వ్యాధులకు మూల కారణం' అని తెలిసిందే. ఈ దురలవాటును వదిలించేందుకు పొగరాయుళ్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ. స్మోకింగ్ మానేసిన కొద్దిరోజులకే కోరికలు పెరిగిపోయి మళ్లీ మొదలెట్టే చాన్స్‌లు కోకొల్లలు. అయితే ఆ క్రేవింగ్స్‌ను 5-10 నిమిషాలు నియంత్రిస్తే మానడం సులభమే అంటున్నారు నిపుణులు. అసలు ధూమపానానికి దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారో ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, రోజుకో సిగరెట్ చొప్పున తగ్గించడం వల్ల ఈ హ్యాబిట్‌ నుంచి పూర్తిగా బయటపడే దిశగా ఒక అడుగు ముందుకు పడినట్లేనని చెప్తున్నారు. మరి ఇందుకు సాయపడే ప్రభావవంతమైన మార్గాలేంటో తెలుసుకుందాం..

ట్రిగ్గర్స్ నివారించండి

తరుచూ స్మోక్ చేసిన ప్రదేశాలు, పరిస్థితులు ధూమపాన కోరికలను బలంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అలాంటి ట్రిగ్గర్స్‌ను కనుగొని.. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఓల్డ్ డేస్ బాగున్నాయని మళ్లీ స్మోకింగ్ అలవాటును పునరావృతం చేసేందుకు మొగ్గుచూపొద్దు.

ఆలస్యం

సిగరెట్ తాగాలనే కోరికకు లొంగిపోతున్నట్లుగా అనిపిస్తే.. మరో 10 నిమిషాలు ఆ కోరికలను అదిమిపెట్టేందుకు ప్రయత్నించాలి. ఆ సమయంలో స్మోకింగ్ నుంచి దృష్టి మరల్చినట్లయితే.. అలాగే ట్రై చేయాలి లేదా పబ్లిక్ స్మోక్-ఫ్రీ జోన్‌కు వెళ్లాలి. ఇలాంటి పనుల వల్ల స్మోకింగ్ హ్యాబిట్‌ను అధిగమించవచ్చు.

ఏదైనా నమలండి

స్మోకింగ్ కోరికను నిరోధించేందుకు నోటిలో ఏదైనా వేసుకుని తినేందుకు ప్రయత్నించాలి. చక్కెర లేని గమ్ లేదా మిఠాయి నమలడం.. పప్పులు, గింజలు, చిరుతిళ్లు తినడం ద్వారా సిగరెట్ అవసరం లేదనే నమ్మకాన్ని పొందాలి.

కేవలం ఒక్కటి

చుట్టుపక్కల వ్యక్తులు సిగరెట్ కాల్చుతుంటే మనలో కూడా ఆ కోరికలు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి. దీంతో ఒక్కటి తాగితే తప్పేముంది? తర్వాత మానేద్దాం! అనే నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ స్మోకింగ్.. ఆ ఒక్క సిగరెట్‌తో మాత్రమే ఆగిపోదని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఒకసారి మొదలుపెడితే మళ్లీ ముగించడం కష్టసాధ్యమే.

శారీరక శ్రమలో మునిగిపోండి

పొగాకు కోరికల నియంత్రణకు నిజానికి శారీరక శ్రమ ఒక గొప్ప మార్గం. మెట్లు దిగడం, నడవడం లేదా జాగింగ్ చేయడం వంటి చర్యలు ధూమపానం మానేసేందుకు సాయపడవచ్చు. ఈ పరిస్థితి నుంచి దృష్టి మరల్చేందుకు డీప్ నీ బెండ్స్(లోతైన మోకాలి వంగడం), పుష్-అప్స్, రన్నింగ్ కూడా చేయొచ్చు.

రిలాక్సేషన్ టెక్నిక్స్

చాలా మంది ఒత్తిడి ఎదుర్కొనేందుకు ధూమపానాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటారు. అయితే ధూమపానానికి వ్యతిరేకంగా పోరాడటం కూడా ఒత్తిడితో కూడుకున్నదే. అందుకే రిలాక్సేషన్ కోసం లోతైన శ్వాస, కండరాల సడలింపు, యోగా, మసాజ్ లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినడం తదిరత మార్గాలను కనుగొనడం ముఖ్యం.

సపోర్ట్ కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయించండి

ఎప్పుడైనా సరే.. ఆన్‌లైన్ స్టాప్-స్మోకింగ్ ప్రొగ్రామ్‌లో చేరవచ్చు లేదా పొగాకు కోరికలతో ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకునేందుకు క్విల్టర్ ప్రయాణం ద్వారా వెళ్లవచ్చు. ఇతరుల నుంచి నేర్చుకున్న టిప్స్‌‌‌‌‌‌‌‌‌తో వీలైనంత త్వరగా ధూమపానం మానేసేందుకు ప్రయత్నించాలి.

ప్రయోజనాలు గుర్తుచేసుకోండి

ధూమపానం మానేయడం ద్వారా మంచి అనుభూతి, ఆరోగ్యం సొంతం కావడంతో పాటు డబ్బు కూడా ఆదా చేయొచ్చని గుర్తుంచుకోవాలి. మరి మీ కోసం, మీ ప్రియమైనవారి కోసం ఎందుకు అలా చేయకూడదు?

Tags:    

Similar News