యోగా టిప్.. గోముఖాసనం వేయడం ఎలా?
దిశ, ఫ్యూచర్: 'గోముఖాసనం' వేయడానికి ముందుగా నిటారుగా కూర్చుని, కాళ్లను ముందుకు చాపాలి.. Latest Telugu News..
దిశ, ఫ్యూచర్: 'గోముఖాసనం' వేయడానికి ముందుగా నిటారుగా కూర్చుని, కాళ్లను ముందుకు చాపాలి. దేహానికి అటూ ఇటూ చేతులను కిందికి చాపి, అరచేతులను నేలపై ఆనించాలి. ఎడమ కాలిని మడిచి కుడి కాలి కింద పిరుదుల దగ్గర ఉంచాలి. కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరుదుల దగ్గర ఉంచాలి. ఇక కుడి చేతిని వెనక్కి మడిచి వీవు మీద ఉంచాలి. ఎడమ చేతిని పైకి ఎత్తి వెనక్కి మడిచి వీపు మీదకు తీసుకురావాలి. చేతులు రెండింటిని ఫొటోలో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి. నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి. కొద్ది క్షణాలు ఇలా చేసిన తర్వాత మెల్లగా ఆసనం నుంచి బయటికి రావాలి.
ఉపయోగాలు
* ఛాతి, భుజంతో పాటు కాలి కండరాలు పటిష్టపడతాయి.
* అతి మూత్రం, నీరసం, నరాల బలహీనత, ఆయాసాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
* మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి నివారణకు హెల్ప్ చేస్తుంది.
* నెర్వస్ సిస్టంలోని నీరసాన్ని తగ్గించి మనసుకు స్థిరత్వాన్నిస్తుంది.