పురుషుల్లో ఆ సమస్యకు ఈ ఆసనంతో చెక్

Update: 2022-03-31 01:30 GMT

దిశ, ఫీచర్స్: బద్దకోణాసనం వేసేందుకు ముందుగా నేలపై కూర్చుని వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లను చాచి, ఆ తర్వాత మోకాళ్ల వద్ద కాస్త మడిచి, రెండు అరికాళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచాలి. ఇప్పుడు చేతి వేళ్లను ఒకదానికొకటి జాయింట్ చేసినట్లుగా ఉంచుకుని, కలిపిన రెండు పాదాలను పట్టుకుని దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో మీ మోకాళ్లు నేలకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తపడుతూ.. నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ వదిలేయాలి. అలా కొద్దిసేపు ఈ ఆసనంలో ఉండాలి.

ఉపయోగాలు:

* నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.

* పురుషుల్లో హెర్నియా సమస్య రాకుండా చేయగలదు.

* మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* గర్భిణులకు సుఖప్రసవం అవుతుంది.

Tags:    

Similar News