వశిష్ఠ ప్రాణాయామం చేసే విధానం.. ప్రయోజనాలు
దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై పడుకుని రిలాక్స్ అవ్వాలి. రెండు కాళ్లు చాచి, రెండు చేతులను ఇరువైపుల పెట్టి అరచేతులను నేలపై ఆన్చాలి..Latest Telugu News
దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై పడుకుని రిలాక్స్ అవ్వాలి. రెండు కాళ్లు చాచి, రెండు చేతులను ఇరువైపుల పెట్టి అరచేతులను నేలపై ఆన్చాలి. తర్వాత రెండు మోకాళ్లను మడిచి, పాదాలను పిరుదులకు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు మన దృష్టి మొత్తం పొట్టపై పెట్టాలి. తర్వాత కడుపులో ఉన్న గాలిని ముక్కు, నోటి నుంచి పూర్తిగా బయటకు పంపించాలి. అలా కాసేపు ఆగి మళ్లీ పొట్టను వీలైనంత ఎక్కువ గాలితో నింపాలి. ఇలా ఓ ఇరవై సార్లు వేగంగా చేయాలి. ఆ తర్వాత పూర్వ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
ప్రయోజనాలు:
* శ్వాస గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
* పారాసింపథెటిక్ ప్రతిస్పందనను సక్రియం చేస్తుంది.
* జీర్ణ, మూత్ర వ్యవస్థలను మెరుగు పరుస్తుంది.
* ఒత్తిడి తగ్గించి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది.