యోగా టిప్.. చక్రాసనం ఎలా వేయాలి..?
దిశ, ఫీచర్: యోగాలోని చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్ళు.. Latest Telugu News..
దిశ, ఫీచర్: యోగాలోని చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తర్వాత మెల్ల మెల్లగా తలను నేలపై ఆనించి నడుమును కూడా ఆనించాలి. దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు:
* వెన్నునొప్పి తగ్గిపోతుంది.
* ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
* థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు తొలిగిపోతాయి.
* చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తివంతంగా మారుతాయి.
* పొత్తి కడుపు కండరాలు బలంగా తయారవుతాయి.
* అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్ధకం పోతాయి.
* రుతుక్రమం సమస్యలు తగ్గుతాయి.
* ముఖంలో కాంతి పెరుగుతుంది.
గమనిక:
హైబీపీ, మైగ్రేన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు ఉన్న వారు చేయకూడదు.