ఆ యాప్‌లో సెలబ్రిటీల నగ్న చిత్రాలు, శృంగార వీడియోలు చూడొచ్చు.. కాకపోతే..

ఫీచర్స్: ఆమె వేశ్య కాదు.. కానీ కస్టమర్ ఉద్వేగాన్ని సంతృప్తిపరుస్తుంది.- latest Telugu news

Update: 2022-03-18 05:02 GMT

ఫీచర్స్: ఆమె వేశ్య కాదు.. కానీ కస్టమర్ ఉద్వేగాన్ని సంతృప్తిపరుస్తుంది. పోర్న్ స్టార్ కాదు.. కానీ శృంగార వీడియోలతో సొమ్ము చేసుకుంటుంది. ఆయా వ్యక్తుల లైంగిక కల్పనలకు అనుగుణంగా మారిపోతుంది. కోరితే నగ్న చిత్రాలను పోస్ట్ చేస్తుంది. నచ్చితే గ్లామర్ టచ్‌తో ఆనందపరుస్తుంది. డిమాండ్ ప్రకారం ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తూ.. బాడీలో ఇంచు ఇంచును అమ్ముకుంటుంది. ఇంతకీ ఈ కథేంటి..? ఈ తతంగం అంతా ఎక్కడ జరుగుతుంది? ఇంత బోల్డ్ అండ్ ఇంటిమేట్ కంటెంట్ కావాలంటే చేయాల్సిన పనేంటి? పొందాల్సిన యాప్ ఏంటి..? చూద్దాం.

'ఓన్లీ ఫ్యాన్స్' యాప్.. ఇక్కడ మోడల్స్, సెలబ్రిటీస్.. యూజర్స్ చెప్పినట్లుగా వింటున్నారు. డిమాండ్లకు అనుగుణంగా బోల్డ్ పిక్స్, డిఫరెంట్ లుక్స్‌తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా వ్యక్తుల సెక్సువల్ ఎమోషన్స్‌ను శాటిస్‌ఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా సర్వీస్ అందించే ఈ ప్లాట్‌ఫామ్‌ను లండన్‌కు చెందిన టెక్ ప్రెన్యూర్, పెట్టుబడిదారుడు తిమోతీ స్టోక్లీ 2016లో ప్రారంభించగా.. పాండెమిక్ టైమ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎంతో మంది స్టార్స్‌ దివాళా తీయకుండా కాపాడిన ఈ యాప్.. కామ:, కామస్య, కామోభ్య: టైప్‌లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

ఎలా వర్క్ చేస్తుంది..?

కస్టమర్స్‌ మరెక్కడా పొందలేని విలువైన, ప్రీమియం కంటెంట్‌ అందించడమే 'ఓన్లీ ఫ్యాన్స్' లక్ష్యం. కాగా కంటెంట్ క్రియేటర్స్ తమ పేజీని ఉచితంగా లేదా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌గా సెట్ చేయవచ్చు. అయితే ప్రీమియం ధరలను అనుసరించి క్రియేటర్స్‌ టార్గెటెడ్ యూజర్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తుంటారు. ఈ మేరకు తమ ఆడియన్స్‌కు నచ్చే విభిన్న రకాల కంటెంట్‌ను పోస్ట్ చేయడంతో పాటు, అడల్ట్ మెటీరియల్‌ని పోస్ట్ చేసే అవకాశాన్ని ఇది సులభతరం చేసింది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ లేదా చిన్న స్టూడియో ఉన్న ఎవరైనా (అతడు లేదా ఆమె) పోర్న్‌గ్రాఫర్‌ క్రియేటర్‌గా మారవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ID, అడల్ట్ కంటెంట్, 18 ఏళ్లు ఉంటేనే ఈ యాప్ యాక్సెస్ చేసే వీలుండగా.. ఈ బ్రాండెడ్ కంటెంట్‌ను కస్టమర్స్ రక్షించాల్సి ఉంటుంది. అందుకే ప్లాట్‌ఫామ్ వెలుపల భాగస్వామ్యం చేయకూడదని కండిషన్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రూల్స్ అతిక్రమించి సైట్‌లో స్క్రీన్ షాట్ తీసేందుకు ప్రయత్నిస్తే.. ఆటోమేటిక్‌గా కంటెంట్ బ్లాక్ అవడంతో పాటు సదరు వ్యక్తిని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది.

ఫీజు ఎంత..?

రచయితలు, కవులు, కళాకారులు, ఇన్‌స్పిరేషనల్ స్పీకర్స్, చెఫ్స్ వంటి ఎవరైనా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు కానీ సెక్స్ వర్కర్స్, పోర్న్ స్టార్స్‌కు కంటెంట్ హబ్‌గా పేరుగాంచింది. ఈ మేరకు ఎఫ్‌బీ, ఇన్‌స్టా వంటి ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో నిషేధించిన కంటెంట్‌ను పోస్ట్ చేసేందుకు 'ఓన్లీ ఫ్యాన్స్'‌ను అనుమతిస్తుంది. దీంతో న్యూడ్, సెమీ న్యూడ్ వీడియోలు, చిత్రాలను అప్‌లోడ్ చేసే ఔత్సాహిక పోర్నోగ్రాఫర్స్ దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇక దీని మినిమమ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు నెలకు $4.99 ఉండగా.. గరిష్టంగా నెలకు $49.99 ఉంది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్స్ కనీసం రూ. 380 ($5)కి ప్రైవేట్ సందేశాలను కూడా సెటప్ చేసుకోవచ్చు. పెయిడ్ టిప్స్, ప్రైవేట్ మెసేజ్‌లు ఆదాయాలను పెంచడమే కాకుండా సృష్టికర్తలు తమ అభిమానులను ఎంగేజ్ చేయడంలో, నమ్మకమైన ఫాలోయింగ్‌ను రూపొందించడంలో సాయపడతాయి.

ఉదాహరణ : అమెరికన్ యాక్ట్రెస్ అన్నాబెల్లా అవెరీ థోర్న్ ఒక్క రోజుకు మిలియన్ డాలర్లు సంపాదించి రికార్డు సృష్టించింది. అయితే మోడల్, సింగర్, డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. ఇమేజ్ అవార్డు, షార్టీ అవార్డు, టీన్ చాయిస్ అవార్డు‌తో పాటు యంగ్ ఆర్టిస్ట్ అవార్డు మూడు సార్లు అందుకుంది. అలాంటి యాక్ట్రెస్ ఇలా దిగజారిందని, 'ఓన్లీ ఫ్యాన్స్' పేజీ ద్వారా తనను తాను అమ్ముకుందని ఎంతో మంది విమర్శించారు.

ఉదాహరణ : మిస్ స్వీడిష్ బెల్లా (అకా మోనికా హల్డ్ట్) నెలవారీ సబ్‌స్కిప్షన్ ఫీజు $6.50గా నిర్ణయించబడినప్పటికీ, 'ఓన్లీ ఫ్యాన్స్‌'లో అత్యధికంగా సంపాదిస్తున్న సృష్టికర్తల్లో ఆమె కూడా ఒకరు. బెల్లాకు 1100 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారని, ఓన్లీ ఫ్యాన్స్‌లో ఏడాదికి $100,000 కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతుందని సమాచారం.

సంపాదన కోసమే..

ఫాలోయింగ్‌ను నిర్మించుకోవడంలోనే ఓన్లీ ఫ్యాన్స్‌ ఆదాయం ముడిపడి ఉంటుంది. కంటెంట్ క్రియేటర్స్ అప్‌లోడ్ చేసే కంటెంట్ నాణ్యత, పరిమాణంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏ క్రియేటర్ ఎంత ఎక్కువ పోస్ట్‌లు చేస్తే అంత ప్రోత్సాహాన్ని అందుకుంటారు. ఈ క్రమంలో బ్రిటిష్ సింగర్ కెర్రీ కటోనా రీసెంట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జీవితంలో రెండు సార్లు దివాళా తీసిన ఆమెను మూడో సారి దివాళా తీయకుండా కాపాడింది 'ఓన్లీ ఫ్యాన్స్' అని చెప్పుకొచ్చింది. తన వక్షోజాలు, ప్రైవేట్ పార్ట్స్‌కు అధిక డిమాండ్ ఉందని.. తద్వారా తను మిలియనీర్ కాగలిగానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎప్పుడూ బోల్డ్ పిక్స్ షేర్ చేసే బ్రిట్నీ స్పియర్స్‌ను అలా బాడీని అందరికీ చూపించకుండా.. 'ఓన్లీ ఫ్యాన్స్' ద్వారా డబ్బులకు అమ్ముకోవాలని సూచించింది.

సంతృప్తి పరిస్తేనే..

ఇక యూజర్స్ సెలబ్రిటీలను కొంటున్నారు కాబట్టి వారు చెప్పినట్లే వినాలి. ముందుగా సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తున్నారు కావున కంటెంట్ శాటిస్‌ఫై లేకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. తమకు ఎలా కావాలో ఓపెన్‌గా చెప్పేస్తూ.. నచ్చిన నగ్నచిత్రాలు, వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఉదాహరణ 1: అమెరికన్ యాక్ట్రెస్ బెల్లా థోర్న్ యాప్‌లో నగ్నచిత్నాలను సెండ్ చేస్తానని కస్టమర్స్‌కు మాటిచ్చింది. కానీ బదులుగా లోదుస్తులు ధరించిన ఛాయాచిత్రాలను మాత్రమే అందించడంతో ఇది పెద్ద సంఖ్యలో ఛార్జ్‌బ్యాక్స్‌కు దారితీసింది.

ఉదాహరణ 2: మోడల్ కార్ల్ వుడ్ సైతం యూజర్స్‌ను శాటిస్‌ఫై చేయలేకపోయాడు. ప్రైవేట్ పార్ట్స్‌ను ఎమోజీలతో కవర్ చేయడాన్ని సబ్‌స్క్రైబ్డ్ కస్టమర్లు తప్పుపట్టారు. రిపీట్ చేయకూడదని హెచ్చరించిన వీరు లేదంటే తిరిగి డబ్బులు చెల్లించడం మరిచిపోరాదని గుర్తుచేశారు.

స్టాటిస్టిక్స్:

2020 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి గూగుల్‌లో 'ఓన్లీ ఫ్యాన్స్' కోసం సెర్చింగ్ విపరీతంగా పెరగ్గా.. మార్చి, ఏప్రిల్ మధ్య సైట్ ప్రతిరోజూ దాదాపు 200,000 మంది కొత్త వ్యక్తులు సైట్‌కు సబ్‌స్క్రయిబ్ అయ్యారని ఓన్లీ ఫ్యాన్స్ నివేదించింది. 2021 మార్చి నాటికి 'ఓన్లీ ఫ్యాన్స్' యూజర్ బేస్ 120 మిలియన్లకు చేరుకోగా సృష్టికర్తలు ఏకంగా $3 బిలియన్ల ఆదాయాం పొందారు.

ప్లాట్‌ఫామ్‌లో చేరిన 24 గంటల్లోనే $1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా బెల్లా థోర్న్ రికార్డ్ సృష్టించింది. అంతేకాదు ఒక వారం కంటే తక్కువ సమయంలో $2 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించింది. ఈ మేరకు ఆమె తన నగ్న ఫోటోలను $200కు అమ్మేసింది.

చాలామంది కంటెంట్ క్రియేటర్స్ నెలకు $145 పైగా సంపాదిస్తున్నారు.

ఏప్రిల్ 2021లో, టైమ్ మ్యాగజైన్ తమ '100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్' కంపెనీల జాబితాలో 'ఓన్లీ ఫ్యాన్స్'‌కు చోటు కల్పించింది. అదేవిధంగా ఫాస్ట్ కంపెనీ కూడా 'ఓన్లీ ఫ్యాన్స్‌'ను 2021లో 10 అత్యంత వినూత్నమైన సోషల్ మీడియా కంపెనీలలో ఒకటిగా అభివర్ణించింది.

ఏప్రిల్ 2021లో, భాద్ భాబీ మొదటి 6 గంటల్లో $1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించి బెల్లా థోర్న్ గత రికార్డును బద్దలు కొట్టింది.

భద్రత ప్రమాణాలు..?

వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత పరంగా 'ఓన్లీ ఫ్యాన్స్' సైట్‌పై పలు ఆరోపణలున్నాయి. క్లయింట్స్ కొందరు క్రియేటర్స్‌ను వేధించారు, కొన్నిసార్లు క్రియేటర్స్ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే చాన్స్ ఉంది. ఇక ఇందులోని క్రియేటర్స్‌లో చాలామంది మూడేళ్లుగా విలువ ఆధారిత పన్ను చెల్లించలేదనే ఆరోపణలున్నాయి.

బీబీసీ 2020లో ప్రచురించిన కథనం ప్రకారం 'ఓన్లీ ఫ్యాన్స్' అండర్ ఏజ్ పిల్లలను నియంత్రించడంలో ఫెయిల్ అయిందని వివరించింది. యూకే పోలీస్, స్కూల్స్, చైల్డ్ లైన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ యాప్‌ యాక్సెస్ నుంచి వీడియోల్లో పిల్లలు కనిపించే వరకు ప్రతీ చోటా తప్పు జరిగిందని చెప్పింది. అంతేకాదు ఈ యాప్ ద్వారా మైనర్ల విక్రయం జరుగుతుందని, సెక్స్ ట్రాఫికింగ్, ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్ జరుగుతుందని, దీనిపై ఇన్వెస్టిగేషన్ జరగాలని యూస్ కాంగ్రెస్ ఉమన్ అన్నా వాగ్నర్ ఒత్తిడి తీసుకొచ్చారు. 

Tags:    

Similar News