ధనుష్ కోసం ఇండియాకు రానున్న హాలీవుడ్ డైరెక్టర్స్
దిశ, సినిమా: రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో దర్శకత్వం వహించిన 'ది గ్రే మ్యాన్' చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ హీరోగా నటించగా..
దిశ, సినిమా: రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో దర్శకత్వం వహించిన 'ది గ్రే మ్యాన్' చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ హీరోగా నటించగా.. కోలీవుడ్ హీరో ధనుష్, క్రిస్ ఇవాన్స్, అనాడి ఆర్మాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌లో భారీ యాక్షన్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న ఈ హాలీవుడ్ డైరెక్టర్స్.. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం ఇండియాకు రాబోతున్నారు. త్వరలో ముంబైలో 'ది గ్రే మ్యాన్' ప్రివ్యూకు హాజరుకానున్నారు. కాగా ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది.