Rahasyam Idam Jagat: ఎంతో తపనతో ఈ సినిమా చేశాం.. నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సైన్స్‌ ఫిక్షన్‌ (Science Fiction) అండ్‌ మైథాలాజికల్‌ (mythological) థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’

Update: 2024-10-21 15:07 GMT

దిశ, సినిమా: సైన్స్‌ ఫిక్షన్‌ (Science Fiction) అండ్‌ మైథాలాజికల్‌ (mythological) థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idam Jagat). పురాణాలు, ఇతిహాసాలు, శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి ఈ సినిమా నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇటీవల విడదలైన టీజర్ (teaser)ను మంచి స్పందన లబిస్తోంది.

ఈ సందర్భంగా హీరోయిన్‌ మానస (Manasa) మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కోమల్‌‌కి థ్యాంక్స్‌. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది. తప్పకుండా అందరూ ఎంజాయ్ (enjoy) చేస్తారు’ అన్నారు. మరో హీరోయిన్ స్రవంతి (stravanthi) పత్తిపాటి మాట్లాడుతూ.. ‘టీజర్‌ (teaser) అందరికి ఎంతో నచ్చింది. తప్పకుండా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.

డైరెక్టర్ కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌ (Komal R. Bharadwaj) మీడియాతో మాట్లాడుతూ.. ‘సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ (Experience) ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌‌ను (Audience) ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌‌గా ఉండే విజువల్స్‌ (Visuals) కూడా ఈ చిత్రంలో ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.


Similar News