Suriya – Balakrishna: బాలయ్యతో హీరో సూర్య అన్‌స్టాపబుల్ షోలో అసలైన ఎంటర్టైన్మెంట్

అన్‌స్టాపబుల్ షో సీజన్ 4కి కొన్ని ఎపిసోడ్స్ ముందే షూట్ చేశారని తెలుస్తోంది.

Update: 2024-10-24 02:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మూడు సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అవుతుంది. అక్టోబర్ 25 నుంచి ఈ షో మన ముందుకు రానుంది. మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారీ హైప్ క్రియోట్ అయింది. అన్‌స్టాపబుల్ షో సీజన్ 4కి కొన్ని ఎపిసోడ్స్ ముందే షూట్ చేశారని తెలుస్తోంది.

తాజాగా, అన్‌స్టాపబుల్ నుంచి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ షోలో సింగం ఫేమ్ సూర్య కూడా రాబోతున్నాడట. అంటే బాలయ్య షోలో సూర్య సందడీ చేయనున్నాడు. తెలుగు స్టార్ హీరోలతో పాటు సమానంగా హోదా దక్కించుకొని తన మంచి మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. నవంబర్ 14న కంగువ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు సూర్య.

కంగువ ప్రమోషన్స్ లో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి సూర్య గెస్ట్ గా రానున్నాడు. దీనికి సంబంధించిన షూట్ అక్టోబర్ 24న జరగనుందని తెలిసిన సమాచారం. పవర్ ఫుల్ పాత్రలతో అలరించిన సూర్య మరి మన బాలయ్యతో కలిసి అన్‌స్టాపబుల్ లో మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News