అన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ. 2,000 పెంచిన హీరో మోటోకార్ప్!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ..telugu latest news

Update: 2022-03-29 14:37 GMT
అన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ. 2,000 పెంచిన హీరో మోటోకార్ప్!
  • whatsapp icon

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్‌షోరూమ్ ధరలపై రూ. 2,000 వరకు పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలు ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న విడి పరికరాల ధరల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మోడల్‌ని బట్టి ధరల పెరుగుదల ఉంటుందని పేర్కొంది.

ఈ ఏడాది ప్రారంభం జనవరిలోనే హీరో మోటోకార్ప్ తన అన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు రూ. 2 వేలు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే దేశీయంగా పలు వాహన తయారీ కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతుండటం వల్ల వచ్చే నెల నుంచి ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేసేందుకు టయోటా కిర్లోస్కర్, ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ సహా పలు కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Tags:    

Similar News